తిరుమలలోని ఆదిశేషు అతిథి గృహం సమీపంలో అరుదైన సుమారు 2 నుంచి 3.5 అడుగుల పొడవున్న ఆకు పచ్చ రంగు నాగుపాము కనిపించి కలకలం రేపింది. తిరుమల పుణ్యక్షేత్రంలో అరుదుగా కనిపించే పచ్చ నాగుపాము ప్రత్యక్షమై భక్తులను ఆశ్చర్యపరిచింది. సాధారణంగా బూడిద రంగు నాగుపాములు కనిపిస్తుండగా, పచ్చ రంగులో ఉన్న ఈ పామును చూసి అందరూ నివ్వెరపోయారు. సమాచారం అందిన వెంటనే టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కరనాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ పామును సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఇలాంటి పచ్చరంగు నాగుపాములు చాలా అరుదుగా ఉంటాయని నిపుణులు తెలిపారు.
తిరుమల కొండపై ఇప్పటి వరకు బూడిద రంగులో.. సహజ సిద్ధమైన రంగులో ఉన్న నాగుపాములు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. శేషాచలం కొండల్లో ఇలాంటి ఆకు పచ్చ రంగులో ఉన్న నాము పాము కనిపించటం ఇదే అంటున్నారు స్నేక్ క్యాచర్స్. ఇలాంటి అరుదైన నాగు పామును గతంలో ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు నిపుణులు. శేషాచలం కొండల్లో ఆకు పచ్చ రంగులో నాగు పాములు ఉన్నాయని.. ఇంకా మరిన్ని అరుదైన జీవ రాశులు ఉన్నాయనేదానికి ఇదే నిదర్శనం. ఆకు పచ్చ నాగు పామును భక్తులు, టీటీడీ సిబ్బంది ఎంతో ఆసక్తిగా గమనించారు. ఈ అరుదైన నాగు పామును పట్టుకుని.. మళ్లీ అడవిలోనే వదిలేశారు సిబ్బంది.
